భారత్ లో మళ్లీ భారీగా పెరిగిన కేసులు
- January 13, 2021
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 15,968 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 202 మంది మృతిచెందగా.. 17,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,29,111 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మరోవైపు ఇప్పటి వరకు 1,51,529 మంది కరోనాతో మృతిచెందారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 8,36,227 కరోనా శాంపిల్స్ పరీక్షించామని.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 18,34,89,114కు చేరుకుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కాగా, గత బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా 12,584 కొత్త కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగి 15,968కు చేరుకుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







