సంక్రాంతి కానుకగా హీరో ధనుష్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
- January 13, 2021చెన్నై:సంక్రాంతి కానుకగా స్టార్ హీరో ధనుష్ మరో సినిమాను ప్రకటించాడు. విలక్షణ డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో కొత్త సినిమా చేస్తున్నారు ధనుష్. ఇప్పటికే అయిరత్తిల్ ఒరువన్ సీక్వెల్‌గా అయిరత్తిల్ ఒరువన్2ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా.. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ట్రాక్ ఎక్కనుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తీస్తున్నారు. "నానే వరువేన్" టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్ పోస్టర్లో కూలింగ్ గ్లాస్ ధరించారు ధనుష్.. తన వెనుక వేర్వేరు రకాల తుపాకులతో అదిరిపోయే లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని.. త్వరలోనే సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను ప్రకటిస్తారని టాక్ వస్తోంది. అయితే... సాయిపల్లవిని ఈ సినిమా హీరోయిన్గా అనుకున్నట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..