ఖిలాడి కొత్త పోస్టర్ విడుదల
- January 13, 2021
హైదరాబాద్:మాస్ మహరాజ్ రవితేజ తాజాగా క్రాక్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తన విజయాత్ర కొనసాగిస్తుందడగానే రవితేజ తన తదుపరి చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చాడు. రవితేజ నూతనంగా చేస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే దీని నుంచి నేడు మరో పోస్టర్ విడుదలైంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగుతోంది. ఈ సినిమా రమేష్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో మాస్ మహరాజ్ సరసన మీనాక్షి చౌదరీ నటిస్తోంది. దీనిని రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఖలాడీ టీం సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో రవితేజ, మీనాక్షి, డింపుల్ హయాతి ముగ్గురు కనిపించారు. ఈ చిత్రం ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇందులో రవితేజ లుక్స్ ఎలా ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బారీ హిట్ కావడంతో రవితేజ తదుపరి చిత్రం ఖాలాడీ పై కూడా అంచనాలు తారాస్థాయిని మించిపోయాయి. మరి ఈ సినిమాతో మరోసారి రవితేజ అభమానులను ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







