వ్యాక్సిన్ ద్వారానే సాధారణ జనజీవనం సాధ్యం..ప్రజలకు యూఏఈ పిలుపు

- January 14, 2021 , by Maagulf
వ్యాక్సిన్ ద్వారానే సాధారణ జనజీవనం సాధ్యం..ప్రజలకు యూఏఈ పిలుపు

 యూఏఈ:కోవిడ్ 19తో ఎదుర్కొంటున్న గడ్డు కాలాన్ని అధిగమించి...మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలంటే వ్యాక్సిన్ తీసుకోవటం ఒక్కటే పరిష్కార మార్గమని యూఏఈ ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తు, సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోవిడ్ 19 క్లీనికల్ మేనేజ్మెంట్ కమిటీ పిలుపునిచ్చింది. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు భాధ్యత నేరవేర్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత..దాని ప్రభావంపై ఇంకా కొంత మందిలో అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవాలని ఖచ్చితమైన షరుతులు విధించకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ ను సమాజంలో కొద్ది మంది తీసుకోవటం ద్వారా ప్రయోజనం ఉండదని, ఎక్కువ సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ అందినప్పుడే దాని లక్ష్యం నేరవేరుతుందని కమిటీ వివరించింది. దీని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఆ వ్యక్తి తనకు తాను వైరస్ నుంచి రక్షించుకోవటమే కాకుండా...వైరస్ వ్యాప్తిని అడ్డుకొని తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడిన వారు అవుతారని తెలిపింది. అంతేకాదు..వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ప్రయాణ ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించిన వారు క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని గుర్తు చేసింది. ఇక దేశ ఆర్ధిక పురోగమనానికి, అందమైన భవిష్యత్తుకు వ్యాక్సిన్ ఒక బూస్టర్ షాట్ గా పని చేస్తుందని అభివర్ణించింది కమిటీ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com