కువైట్:ఇంగ్లీష్ వచ్చినవారికే ఉన్నత ఉద్యోగాలు...

కువైట్:ఇంగ్లీష్ వచ్చినవారికే ఉన్నత ఉద్యోగాలు...

కువైట్ సిటీ:ఉన్నత ఉద్యోగాలకు సంబంధించి కువైట్ కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సుపర్ వైజర్ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలని కండీషన్ పెట్టింది. ఈ మేరకు ప్రజా పనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరిపాలనా పరమైన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, సుపర్ వైజర్ స్థాయి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంగ్లీష్ టెస్ట్ ఓ భాగం కానుందని స్పష్టం చేసింది. ఆ స్థాయి ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్ధులు ముందుగా తాము పెట్టిన ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనని వివరించింది. ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన వెలువడిన పది పని రోజుల్లో అభ్యర్ధులు పర్సనల్ అఫైర్స్ డైరెక్టర్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హజరవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఉద్యోగాల అప్లికేషన్ను నింపి, ఇంగ్లీష్ టెస్టులో పాసైన వారికే ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని మంత్రిత్వ కార్యదర్శి తమ ఉత్తర్వులో పేర్కొన్నారు. 

 

Back to Top