ఏ.పీ,తెలంగాణ రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు!
- January 14, 2021
ఏ.పీ,తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కలకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉదయాన్నే ఆడపడుచులు రంగవల్లుల వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివెరిస్తోంది. బంధు మిత్రులతో పల్లెలు సందడిగా కనిపిస్తున్నాయి అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగాఓణి ధరించి తెలుగింటి సంప్రదాయాన్నిచాటి చెబుతున్నారు. తెలుగువారికి అసలైన పెద్ద వేడుక సంక్రాంతి. ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేర్చి సందడిగా మార్చే సిసలైన పండుగ ఇది. మూడు రోజుల పండుగలో భాగంగా ఇప్పటికే భోగీ సందడి ముగిసింది. ఇక పెద్దపండగైన సంక్రాంతిని అంతా ఒక్కటై జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. పచ్చని పొలాల మాటున మంచు తెరలను చీల్చుకుంటూ దక్షణాయనం పయనించి ఉత్తరాయనం దిశగా గమనం మార్చుకునే సూర్యభగవానుడికి ప్రజలంతా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







