వుహాన్‌ చేరుకున్న WHO బృందం

- January 14, 2021 , by Maagulf
వుహాన్‌ చేరుకున్న WHO బృందం

చైనా:ప్రపంచం మొత్తం వణికిపోయేలా చేసింది కరోనా వైరస్.. అన్ని రంగాలను ఎప్పుడూలేని విధంగా దెబ్బకొట్టింది.. ఏడాది గడిచినా.. ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి.. పంపిణీకి సిద్ధం అవుతున్నారు. అది ఈ వైరస్‌ పురుడుపోసుకున్నది మాత్రం చైనాలోనే.. ఆ దేశంలోని వుహాన్ సిటీలో పుట్టి.. ఎన్నో దేశాలను చుట్టేసింది.. వూహాన్‌లోని పురుడుపోసుకుని మారుమూల పల్లెలో సైతం అడుగుపెట్టింది. అయితే, క‌రోనా వైర‌స్ మూలాల‌ను క‌నుగొన‌డానికి 10 మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) సైంటిస్టులు వుహాన్ చేరుకున్నారు. ఈరోజు వుహాన్‌లో అడుగుపెట్టారు సైంటిస్టులు.. అయితే.. వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాప్తిం చెందింది లాంటి విషయాలపై అధ్యయయనం చేయనన్నారు. 

సైంటిస్టులు సింగ‌పూర్ నుంచి నేరుగా వుహాన్ చేరుకున్నట్లు చైనా అధికార మీడియా కూడా ధృవీక‌రించింది. అయితే, ద‌ర్యాప్తు మాత్రం ఆలస్యం కానుంది.. ఎందుకంటే.. చైనా నిబంధ‌న‌ల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.. దీంతో.. డ‌బ్ల్యూహెచ్‌వో టీమ్ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. అంటే క్వారంటైన్‌ పూర్తి అయిన తర్వాతే ఆయా ప్రాంతాలను పరిశీలించే అవకాశం ఉంది. కానీ, ఈ క్వారంటైన్ స‌మ‌యంలోనే సైంటిస్టులు.. చైనా మెడిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. ఫీల్డ్‌ విజిట్ లేట్ అయినా.. దర్యాప్తు మాత్రం ఇవాళ్టి నుంచే దర్యాప్తు మాత్రం సాగనుంది.. కాగా, డబ్ల్యూహెచ్‌వో టీమ్ ముందుగానే వుహాన్‌లో పర్యటించాల్సి ఉంది.. కానీ, డ్రాగన్ కంట్రీ అనుమతి ఇవ్వకపోవడంతో.. ఆలస్యం జరాగింది. మరి డబ్ల్యూహెచ్‌వో సైంటిస్టులు ఏం తేలుస్తారనేది ఉత్కంఠగా మారింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com