వకీల్‌సాబ్ టీజర్ విడుదల
- January 14, 2021
హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్‌సాబ్. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళుగాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కిరణాల కారణంగా వాయిదా పడటంతో అభిమానులు బాధపడ్డారు. వారిని సంతృప్తి పరిచేందుకు నూతన సంవత్సర కానుకగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. అయితే నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ అలరించేందుకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అడ్వకేట్‌గా కనిపించాడు. చాలా పవర్ఫుల్ న్యాయవాదిగా పవన్ దర్శనమిచ్చాడు. అంతేకాకుండా ‘కోటు వేసుకొని వాదించడం తెలుసు. కోటు తీసి వాయించడం తెలుసు’ అని తనదైన తరహా డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా చేస్తుంది. టీజర్లో శ్రుతీ హాసన్ ఎక్కడా కనిపించిలేదు. టీజర్ చూస్తుంటే మాత్రం సినిమా అభిమానుల అంచనాలను మించి ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. పవన్ అభిమానులకు ఏం కావాలో అది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం పవన్ పవర్‌కి తగ్గట్టుగా పాత్రలను డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. మరి సినిమా కూడా ఇదే స్థాయిలో అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష