ఇండోనేషియా విమాన ప్రమాదం...కొనసాగుతున్న గాలింపు చర్యలు
- January 14, 2021
ఇండోనేషియాలో 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం జనవరి 9న అదృశ్యమై సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే విమానం కూలిపోయినప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం అన్వేషన కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం . శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం నుంచి విడిపోయిన కాక్‌పిట్ వాయిస్ రికార్డు కోసం డ్రైవర్లు థౌజెండ్ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు సహాయక సిబ్బంది. మరోవైపు మంగళవారం రోజు విమానంలో డేటాతో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను సహాయక సిబ్బంది గుర్తించారు.
కాగా, విమానం గాలింపు కోసం తీవ్ర ప్రాంతాల్లో అన్వేషణను మరింతగా పెంచినట్లు రెస్క్యూ మిషన్ బృందం తెలిపింది. సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపింది. ఈ గాలింపు కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్లను రంగంలోకి దింపినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ఫర్ట్లకు పంపారు. అలాగే ప్రభుత్వం విపత్తు బాధిత గుర్తింపు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఫ్లైట్ అటెండెంట్, ఆఫ్ డ్యూటీ ఫైలట్‌తో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు ఆ కేంద్ర అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







