పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం..

- January 15, 2021 , by Maagulf
పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం..

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఈ అవార్డులను అందిస్తారు. ప్రముఖంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణం తదితర రంగాల్లో విశేష క‌ృషి చేసిన పదిహేను మందికి పద్మశ్రీ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు.

జగదీష్ లాల్ అహుజ – పంజాబ్ (సోషల్ వర్క్), రహిబాయి సోమపోపెర్- మహారాష్ట్ర ( ఆర్గానిక్ వ్యవసాయం), ముజిక్కల్ పంకజాక్షి-కేరళ ( ఆర్ట్), మొహమ్మాద్ షరీఫ్- యూపీ(సోషల్ వర్క్- ఉచిత అంత్యక్రియలు), రవికన్నన్- అస్సాం ( మెడిసిన్), హరేకల హజబ్బా- కర్ణాటక( సోషల్ వర్క్-విద్య), ఉషా చౌమార్- రాజస్థాన్ ( సోషల్ వర్క్-శానిటేషన్), తులసి గౌడ- కర్ణాటక( సోషల్ వర్క్-పర్యావరణం), అబ్దుల్ జాబ్బర్-మధ్యప్రదేశ్ (సోషల్ వర్క్- సేవ), ఎస్ రామకృష్ణన్-తమిళ్ నాడు (సోషల్ వర్క్-దివ్యాంగ్), యోగి ఏరాన్- ఉత్తరాఖండ్ ( మెడిసిన్), మున్నా మాస్టర్- రాజస్థాన్( ఆర్ట్- భజన్స్), సుందరం వర్మ- రాజస్థాన్( సోషల్ వర్క్- పర్యావరణం), రాధా మోహన్ మరియు సబర్ మాటి- ఒడిశా ( ఆర్గానిక్ వ్యవసాయం), సత్యనారాయన్ ముండయూర్ -అరుణాచల్ ప్రదేశ్ ( సోషల్ వర్క్- విద్య) మొదలగు వారు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com