లండన్ తరహా ట్యాక్సీలు దుబాయ్‌లో అతి త్వరలో

లండన్ తరహా ట్యాక్సీలు దుబాయ్‌లో అతి త్వరలో

దుబాయ్:దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) త్వరలో లండన్ ట్యాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఫ్యూయల్ అలాగే ఎలక్ట్రిసిటీని ఈ ట్యాక్సీలు వినియోగించనున్నాయి. బ్రిటిష్ రాజధానిలో ట్యాక్సీలు నల్లటి రంగుతో, సెమీ కర్వ్‌డ్ షేప్‌లో వుంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్ని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తారు. ప్రత్యేక క్యాబిన్‌లో మొత్తం ఆరు సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి ఈ కారులో. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం కూడా తగిన సదుపాయాలు వుంటాయి. శాటిలైట్ బేస్డ్ నావిగేషన్, వాయిస్ కమాండ్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపాచ్యుర్ వార్నింగ్ సిస్టమ్స్, వైఫై వంటి సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. డ్యూయల్ ఇంజిన్ మరో ప్రత్యేకత. 30 నిమిషాల్లో రీచార్జ్ అయ్యే బ్యాటరీని వీటిల్లో వినియోగిస్తారు. 

Back to Top