సౌదీ అరేబియాలో 150కి దిగువలో నమోదవుతున్న వైరస్ కేసులు

- January 17, 2021 , by Maagulf
సౌదీ అరేబియాలో 150కి దిగువలో నమోదవుతున్న వైరస్ కేసులు

రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిలో సౌదీ ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలు కొద్ది మేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 140 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్నాళ్లుగా 150 లోపే పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. కొత్త నమోదైన కేసులతో కలుపుకొని కింగ్డమ్ పరిధిలో ఇప్పటివరకు 3,64,753 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 1,894 యాక్టీవ్ కేసులు ఉండగా...అందులో 321 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో పోలిస్తే..రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 159 మంది రికవరి అయ్యారని, మొత్తంగా ఇప్పటివరకు  3,56,541 మంది కోవిడ్ నుంచి రికవరి అయినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..కోవిడ్ కారణంగా మరో ఐదు మంది మృతి చెందారు. దీంతో కింగ్డమ్ పరిధిలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 6,318 మందికి పెరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com