టీకా కార్యక్రమం విజయవంతం కావటం పట్ల ఏ.పీ గవర్నర్ అభినందన
- January 17, 2021
విజయవాడ:కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. శనివారం దేశవ్యాప్తంగానూ, ఆంధ్రప్రదేశ్ లోనూ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించటం ముదావహమన్నారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పరిశోధకులు తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ముందువరుస ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..