'రోబరి' సినిమా ట్రైలర్ విడుదల
- January 17, 2021హైదరాబాద్:సుదర్శన్ మూవీ మేకర్స్ పతాకంపై యస్.యన్. నాయుడు, యస్.ఏ.నరసమ్మ సమర్పణలో యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా, యస్.సుధీర్ సహనిర్మాతగా అభిషిక్త్, సమ్మోహన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రోబరి'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ' ట్రైలర్ బాగుంది. ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు, హీరో హీరోయిన్ కు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు. మరో అతిథి ఏ.పి.ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ' ఎన్నో సంవత్సరాలుగా సినిమాను నమ్ముకొని వున్న వ్యక్తి శ్రీనివాస్ అని, ఈ సినిమా విజయంతో అతని చిరకాల కోరిక నెరవేరి మరెన్నో చిత్రాలను నిర్మించాలని కోరారు.
దర్శక నిర్మాత యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ 'నా అభిమాన హీరో శ్రీకాంత్ చేతులమీదుగా నా రోబరి సినిమా ట్రైలర్ లాంచ్ జరగడం నా అదృష్టమని, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీమిత్ర చౌదరి , మోహన్ గౌడ్ నేను ఋణపడి వుంటానని, శ్రీకాంత్ ది లక్కీ హ్యాండని, ఆ లక్కీ మాకు కూడా కలిసివస్తుందని ఆశిస్తున్నామని' తెలిపారు. హీరో అభిషిక్త్ మాట్లాడుతూ' ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందని, దర్శక నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడా రాజీ పడకుండా మాతో నటింపజేశాడని' తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర చౌదరి, నారాయణరావు, పెరుగు వెంకటేష్, మిత్తాని ఈశ్వర్, రాయిపాటి నాగేశ్వర్, దొరబాబు, మణికంఠ పాల్గోన్నారు. యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, ఫైట్స్: మల్లేశ్ - దేవరాజ్, డైలాగ్స్: నండూరి వీరేశ్, కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: అనిల్ కుమార్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..