IPL సీజన్14 షెడ్యూల్ విడుదల...
- January 17, 2021
ముంబై:ఫిబ్రవరి 16న మీని వేలం జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ వేలానికి ముందు ఫ్రాంఛైజీల అందించే జాబితాను పరిశీలించి వేలంలో పాల్గోనబోయే ఆటగాళ్ళ పూర్తి జాబితాను సిద్దం చేయనుంది BCCI. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఈసారి భారతదేశంలోనే IPL నిర్వహించాలని BCCI ఆలోచిస్తోంది.
IPL వేలానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. IPL 14వ ఎడిషన్ మీని వేలం ఫిబ్రవరి 11న జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికి అయితే ఆ విషయంపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది. అయితే తాజా సమాచారం 2021 ఫిబ్రవరి 16 న ఆక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వేలం పాల్గోనే ఆటగాళ్ళు ఫిబ్రవరి 4 లోపు ఆన్‌లైన్ ఆప్షన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని BCCI సూచించింది.ఇక వేలం సంబంధించిన విషయాలను నేరుగా రాష్ట్ర సంఘాలతో మాత్రమే BCCI చర్చించనుంది. అయితే స్టేట్ క్రికెట్ ఆసోషియన్ తరుపున ఆడుతున్న ఆటగాళ్ళతో కానీ వారి మెనేజర్‌లతో కానీ వేలం సంబంధించిన విషయాలను పంచుకొదు. వేలం పాల్గోనే ఆటగాళ్ళు సంబంధిత రాష్ట్ర క్రికెట్ సంఘాల ద్వారా మాత్రమే పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.
ఇక గత నెలలో జరిగిన BCCI వార్షిక సమావేశంలో IPL 2021 సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సీజన్లలో 8 జట్లు మాత్రమే ఆడనున్నాయని .. 2022 లో 10 జట్లను చేర్చుతున్నట్లు BCCI ప్రకటించింది. అలాగే ఈసారి మెగా వేలం ఉండదని తెలిపింది. దీంతో ఈ ఏడాది మీని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో సమావేశం అయే IPL పాలకమండలి వేలానికి సంబంధించి మరిన్ని విషయాలపై స్పష్టత ఇవ్వనుంది. అన్ని ఫ్రాంచైజీలకు వీలైనంత త్వరగా ఆటగాళ్లకు విడుదల చేయాలని సూచించింది. జనవరి 20 నాటికి అన్ని ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల సిద్దం చేయాలని ఆదేశించింది. జట్టుల్లో ఏ ఆటగాళ్ళను రీలిజ్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఫిబ్రవరి 16న మీని వేలం జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ వేలానికి ముందు ఫ్రాంఛైజీల అందించే జాబితాను పరిశీలించి వేలంలో పాల్గోనబోయే ఆటగాళ్ళ పూర్తి జాబితాను సిద్దం చేయనుంది BCCI. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఈసారి భారతదేశంలోనే IPL నిర్వహించాలని BCCI ఆలోచిస్తోంది. 11 ఏప్రిల్ 2021న IPL ప్రారంభంకానున్నట్లు తాజా సమాచారం. సీజన్ 14 తొలి ఆరంభ మ్యాచ్ ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరుతో తలపడనంది.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్‌లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







