'అలా సింగపూరంలో' షార్ట్ ఫిలిం...
- January 17, 2021
సింగపూర్ నుండి ఒక సరికొత్త తెలుగు షార్ట్ ఫిలిం "అలా సింగపూరంలో.." శనివారం ఉదయం అంతర్జాల వేదికపై వైభవంగా విడుదలైంది.
సింగపూర్ తెలుగు టీవీ సమర్పణలో, తెలుగు భాష సంస్కృతి విలువలను గురించిన ఇతివృత్తంతో తీయబడిన ఈ షార్ట్ ఫిలింకు, రచన, నటన, దర్శకత్వం మొదలగు అన్ని సాంకేతిక రంగాలలో పనిచేసినవారంతా కేవలం సింగపూర్ లో నివసించే తెలుగువారు మాత్రమే కావటం దీని ప్రత్యేకత.
సింగపూర్ తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో జూమ్ అంతర్జాల వేదికపై, ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ సినీ రచయిత భువన చంద్ర, ప్రముఖ సినీ దర్శకులు వి.ఎన్.ఆదిత్య సమక్షంలో ఈ చిత్రాన్ని సింగపూర్ తెలుగు టీవీ ఛానల్ ద్వారా విడుదల చేశారు.

సింగపూర్ తెలుగు టీవీ వ్యవస్థాపకులు గణేశ్న రాధాకృష్ణ మాట్లాడుతూ.. తన కలకు ప్రతిరూపంగా సింగపూర్ లో నివసించే తెలుగువారిలో ఉన్న ప్రతిభను సద్వినియోగం చేస్తూ ఈ షార్ట్ ఫిలిం రూపొందించడం జరిగిందని, ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అతిధులు భువనచంద్ర మరియు సినీ దర్శకులు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ "నటులు, దర్శకులు, రచయిత, కెమెరామాన్ మరియు అన్ని సాంకేతిక విభాగాల వారు ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారని, ప్రత్యేకించి కథ, దానిని తెరకెక్కించిన విధానం చాలా బాగుందని, అందరూ కొత్తవారైనా కూడా సింగపూర్ వంటి పరాయి దేశంలో ఉండే పరిమితులను అధిగమించి ఎంతో అద్భుతంగా మన తెలుగుదనాన్ని మనసుకు హత్తుకునే విధంగా ఈ చిత్రాన్ని ఆవిష్కరింపజేశారు" అని తెలిపి ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
"సింగపూర్ లో నివసించే ప్రవాసాంధ్ర కుటుంబాలలో ఉండే ఆలోచనా విధానం, భారతీయ సంస్కృతితో వారు అనుసంధానింపబడే తీరు, తలెత్తే సంఘర్షణ వంటి సున్నితమైన అంశాలతో, అన్ని దేశాలలోని తెలుగువారిని ఆకట్టుకునే విధంగా ఈ కధను రూపొందించే ప్రయత్నం చేశామని" కథ సంభాషణలు అందించిన రాధిక మంగిపూడి తెలిపారు.
రాధాకృష్ణ కెమెరా, దర్శకత్వం, ఎడిటింగ్ విభాగాలకు సేవలందించగా, ధవళ కళ్యాణ్ సహదర్శకులుగా ఈ చిత్రానికి ఒక పరిపూర్ణతను తీసుకువచ్చారు. కాత్యాయని గణేశ్న ఆడియో సహకారం అందించగా, కవుటూరు రత్న కుమార్ సలహాదారులు మరియు పర్యవేక్షకులుగా తమ వంతు సహాయం అందించారు.
సింగపూర్ లో లావణ్య, భరద్వాజ్ దంపతుల గృహంలో ఈ చిత్రం షూటింగ్ మొత్తం రెండు రోజుల్లో పూర్తి చేశారు. రామాంజనేయులు, కామేశ్వరి, భార్గవి, రాజశేఖర్, శివరంజని, సంతోష్, శాంత, వైష్ణవి, ఆశ్రిత, భరత్, ప్రతీక్ నటీనటులుగా గా 23 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా తీయబడిన ఈ లఘు చిత్రం, విడుదలైన గంట సేపటికే యూట్యూబ్ లో 1000 మంది అభిమానాన్ని చూరగొంది. తమ శ్రమకు తగిన ఫలితం లభించి మరింత శరవేగంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుందని "అలా సింగపురంలో" లఘు చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ లఘు చిత్రాన్ని ఈ క్రింది లింకు ద్వారా ప్రేక్షకులు చూడవచ్చును.
https://www.youtube.com/watch?v=tiGU7-qQPvc&authuser=0
తాజా వార్తలు
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు







