కమ్మేసిన పొగమంచు: వేగ పరిమితి తగ్గింపు
- January 19, 2021
యూఏఈ వ్యాప్తంగా పలు ప్రాంతాల్ని పొగ మంచు కమ్మేస్తోంది. ఈ కారణంగా విజిబులిటీ గణనీయంగా తగ్గిపోతోంది. సోమవారం అర్థరాత్రి నుంచి పొగమంచు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వాహనదారులు పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, వేగ పరిమితికి లోబడి వాహనాలు నడపాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అబుదాబీ పోలీస్, వాహనాల వేగ పరిమితిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. క్యాపిటల్ వైపుగా వచ్చే రోడ్లపై వేగ పరిమితిని గంటకు 80 కిలోమీటర్లకే తగ్గించారు. అబుదాబీ అల్ అయిన్ రోడ్డు, అల్ ఫయాహ్ రోడ్డు, షేక్ ఖలీఫా ఇంటర్నేషనల్ రోడ్డు, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డు, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మరియు మక్తౌమ్ బిన్ రషీద్ రోడ్లపై వేగ పరిమితిని తగ్గించారు. ఆయా రోడ్లపై ఏర్పాటు చేసిన స్మార్టు బోర్డులపై ప్రదర్శితమయ్యే సూచనలను వాహనదారులు ఫాలో అవ్వాల్సి వుంటుంది. ముందు, వెనుక వాహనాలతో తగిన దూరాన్ని వాహనదారులు పాటించాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష