కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్‌.. భార్య మృతి

కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్‌.. భార్య మృతి

యూఏఈ: యూఏఈ లోని అజ్మాన్‌లో ఓ వ్యక్తి కారు పార్కింగ్‌ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది.వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన లిజీ(45) తన భర్తతో కలిసి శనివారం హెల్త్‌ చెకప్‌ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు.అజ్మాన్ ‌లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్‌ చెబుతోంది.ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది.

ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.పదేళ్ల క్రితమే ఈ జంట యూఏఈలో స్థిరపడ్డారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్‌ చేస్తుండగా కూతురు దుబాయ్‌లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్‌ కమ్యూనిటీ షాక్‌కు గురైనట్లు ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ సజద్‌ నిట్టికా తెలిపారు.ఈ ఘటనపై అజ్మాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్‌ అసోసియేషన్‌ కుటుంబానికి సహకరిస్తోందన్నారు. 

Back to Top