ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా
- January 20, 2021
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది'' అన్నారు .
దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ- మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్ లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







