స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయులను అరెస్ట్ చేసిన ఒమన్ పోలీసులు

- January 20, 2021 , by Maagulf
స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయులను అరెస్ట్ చేసిన ఒమన్ పోలీసులు

మస్కట్:స్మగ్లింగ్, నిషేధిత మత్తు పదార్ధాల అక్రమ రవాణా కేసులో రాయల్ ఒమన్ పోలీసులు ఇద్దరు ప్రవాసీయులను అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.నిందితుల్లో ఒకరు విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తు పట్టుబడినట్లు తెలిపారు.మరో నిందితుడు పొగాకు ఉత్పత్తులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. అతని దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో పొగాకు, చూయింగ్ టొబాకోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టైన ఇద్దరి కేసును న్యాయ విచారణకు బదిలీ చేసినట్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com