కువైట్లో ఇండియన్ స్పోర్ట్స్ నెట్వర్క్ లాంచ్ చేసిన ఇండియన్ ఎంబసీ
- January 22, 2021
కువైట్ సిటీ:దేశంలోని భారతీయ క్రీడాకారులను, క్రీడలను ఇష్టపడేవారిని, స్పోర్ట్స్ అసోసియేషన్ లను ఏకతాటిపైకి తెచ్చేందుకు కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఇండియన్ స్పోర్ట్స్ నెట్వర్క్-ISNను ప్రారంభించింది. కువైట్లో ఉంటున్న భారతీయ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు, వారిని ఐక్యం చేసేందుకు ఐఎస్ఎన్ ఎంతగానో దోహదపడుతుందని ఎంబసీ అధికారులు అభిప్రాయపడ్డారు. క్రీడా సంబంధిత వ్యక్తులకు ఇది ఓ మంచి వేదికగా మారుతుందని, అలాగే ఇప్పటికే క్రీడా సంస్థల బలోపేతానికి కృషి చేయవచ్చని తెలిపింది. అందుకే కువైట్లోని భారతీయ క్రీడాకారులు, క్రీడా సంస్థలు https://forms.gle/81pdWSAbyZTHveVY6 లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకొని అంతా ఒకే వేదిక మీదకు వచ్చేందుకు సహకరించాలని ఎంబసీ అధికారులు కోరారు. ఇండియన్ స్పోర్ట్స్ నెట్వర్క్ కు అనుబంధంగా ట్వీటర్ అకౌంట్ ను కూడా ప్రారంభించామని...@Indian_ISN ట్విటర్ అకౌంట్ ద్వారా స్పోర్ట్స్ రిలేటెడ్ వివరాలను షేర్ చేసుకోవచ్చని వివరించింది. ఐఎస్ఎన్ కు సంబంధించి మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ కోసం [email protected]కు మెయిల్ చేయవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష