కోవిడ్ 19 స్ట్రెయిన్ ఫ్రీ దేశంగా బహ్రెయిన్..

- January 22, 2021 , by Maagulf
కోవిడ్ 19 స్ట్రెయిన్ ఫ్రీ దేశంగా బహ్రెయిన్..

మనామా:కోవిడ్ 19 కుదుపు కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు బ్రిటన్లో వెలుగుచూసిన కోవిడ్ స్ట్రెయిన్ మరో తలనొప్పిగా మారింది. కోవిడ్ 19 నియంత్రణకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభించిన పలు దేశాలు...తమ దగ్గర స్ట్రెయిన్ వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా రూపాంతరం చెందిన కోవిడ్ 19 వైరస్ తమ దేశ పరిధిలోకి విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకైతే బహ్రెయిన్ లో కోవిడ్ వేరియంట్ ఏమి కనిపించలేదని..ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించింది. దీంతో కింగ్డమ్ ను కోవిడ్ స్ట్రెయిన్ ఫ్రీ కంట్రీగా ప్రకటించిన ఆరోగ్య శాఖ..వైరస్ వేరియంట్ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, స్ట్రెయిన్ ట్రాకింగ్ కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఇదిలాఉంటే..కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. కింగ్డమ్ లోని పౌరులు, ప్రవాసీయులను కలుపుకొని 15 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నామని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com