ఫిబ్రవరి 19న విడుదల కానున్న 'చెక్'
- January 22, 2021
హైదరాబాద్:టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్‌లో 28వ సినిమాగా 'చెక్' రాబోతుంది. ఈమేరకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 19న 'చెక్' ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్. కాగా గతేడాది హీరో నితిన్ 'భీష్మ' హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తరువాత నితిన్ కి ఈ సినిమా సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నితిన్ డిఫరెంట్ మూవీగా 'చెక్' చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమద్యే రిలీజ్ అయిన టీజర్ లో.. ఖైదీగా నితిన్‌ని చూపిస్తూ ఆయనకు చెస్ ఆడే టాలెంట్ ను చూపించారు. ఈ సినిమా టీజర్ బట్టి చుస్తే నితిన్ మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు నితిన్. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలు ప్రేక్షకునికి దగ్గరగా ఉండడం కలిస్తోందనే చెప్పాలి. ఇక నితిన్, కీర్తి సురేష్ తోను నటించిన ‘రంగ్ దే’ సినిమా కూడా ఈ వేసవిలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష