బహ్రెయిన్‌లో భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌లో భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్: భారత ఎంబసీ, ఎంబసీ కాంప్లెక్స్ వద్ద జనవరి 26న భారత గణ తంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించనుంది. ఉదయం 7.30 నిమిషాలకు జాతీయ జెండాని ఎగురవేయనున్నారు. భారత రాష్ట్రపతి సందేశాన్ని రాయబారి పియుష్ శ్రీ వాస్తవ చదవనున్నారు. ఎంబసీ, వర్చువల్ విధానంలో కూడా ఈ వేడుకల్ని నిర్వహించనుంది. కరోనా నేపథ్యంలో గేదరింగ్స్‌కి అవకాశం లేనందున, తక్కువ మంది సమక్షంలోనే 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని లైవ్‌ ప్రసారం చేయనున్నారు వివిధ మాధ్యమాల ద్వారా. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో లైవ్ ప్రసారాన్ని వీక్షించవచ్చు.

Back to Top