‘నాట్యం’ ఫస్ట్‌లుక్ పోస్టర్
- January 23, 2021
హైదరాబాద్:`నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం` ఒక మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ తెలుగు ఫీచర్ ఫిలిం త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌లో విడుదలకాబోతుంది. హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డాన్సర్ సంధ్యరాజు మొదటిసారిగా ఒక తెలుగు సినిమాలో నటించారు. ఆమె తన నటన, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనుంది.
ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి ఉపాసన కొణిదెల ఈ రోజు ఉదయం10:08 నిమిషాలకు `నాట్యం` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సాంప్రదాయ చీర కట్టుతో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యరాజు తన పాత్రలో ఒదిగిపోయారు. వెనక అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక నాట్య దేవతలా కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలని ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మూవీ ద్వారా రేవంత్ కొరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా అతనే..
ఈ చిత్రం ఒక గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే ఒక మంచి ప్రేమకథతో ముడిపడి ఉంది.కమల్‌కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ అందమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు మరియు హైదరాబాద్ లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో విజువల్ బ్యూటీగా నిర్మించబడింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు