సేఫ్టీ క్యాంపెయిన్‌లో 10000 మంది రెసిడెంట్స్
- February 24, 2016
ఏస్టెర్ డీఎం హెల్త్ కేర్, 10000 మంది బహ్రెయినీ రెసిడెంట్స్‌తో రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ చేపడుతోంది. ఫిబ్రవరి 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, సేఫ్టీ క్యాంపెయిన్‌కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ముందుకొచ్చినవారి సంఖ్య 10000కు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ఏస్టర్ ఛైర్మన్ మరియు మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అజాద్ మోపెన్ మరియు ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకపోవడం, ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఉపయోగించడం, జీబ్రా క్రాసింగ్స్‌ని, సబ్ వేస్, ఫుట్ పాత్స్‌ని వినియోగించడం వంటివి ఇందులో ముఖ్యమైన అంశాలు. పబ్లిక్ పార్కుల వద్ద నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల్లో పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్, ఆండాలుస్ గార్డెన్, మెరీనా బీచ్, అరద్ రిజర్వ్, సితారా కోర్నిచె, సల్మానియా పార్క్ తదితర చోట్ల ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అలాగే పలు స్కూళ్ళు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







