ఘనంగా నటభూషణ శోభన్ బాబు 85వ జయంతి

- January 24, 2021 , by Maagulf
ఘనంగా నటభూషణ శోభన్ బాబు 85వ జయంతి

హ్యూస్టన్  టెక్సాస్: అమెరికా గాన కోకిల శారద ఆకునూరి  రూపకల్పన మరియు సారధ్యంలో నటభూషణ శోభన్ బాబు 85  వ జయంతి కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ వారు శిరోమణి డా.రామరాజు నిర్వహణలో జనవరి 23  శనివారం సాయంత్రం 6  గంటలకు అంతర్జాలంలో ఎంతో జయప్రదంగా జరిగింది. 

శోభన్ బాబు  నటుడుగా, స్నేహశీలి గా, దానశీలి గా క్రమశిక్షణ గల వ్యక్తిగా ఆయన గుణ గణాలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రధాన అతిధి జ్ఞాపకం చేసుకున్నారు. తాసిల్దారుగారి  అమ్మాయి చిత్రం లో నాయికగా నటించిన ప్రజా నటి  కళాభారతి డా.జమున రమణారావు , శోభన్ బాబు తో జేబుదొంగ, బంగారు చెల్లెలు, దీపారాధన, రాజువెడలెఁ వంటి చిత్రాల్లో నటించి , ఆయనతో ముగ్గురు మిత్రులు సినిమా తీసిన  ఎం.మురళీమోహన్ , ప్రేమ మూర్తులు ,బావమఱదళ్ళు, కోడెత్రాచు, మిస్టర్ విజయ్, మహా సంగ్రామం, శ్రావణ సంధ్య, కార్తీక పౌర్ణమి చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి,  సంసారం చిత్రానికి దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు,  బావ మరదళ్ళు, మహారాజు, పున్నమి చంద్రుడు, భార్యాభర్తలు మొదలైన చిత్రాలను  శోభన్ బాబు తో నిర్మించిన రాశి మూవీ క్రియేషన్స్ నరసింహారావు,  శోభన్ బాబు తో వ్యక్తిగత అనుబంధమున్న డా నగేష్ చెన్నుపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవనతరంగాలు, పసిడి మనసులు, రామాలయం, దేవుడు  చేసిన పెళ్లి , కాలం మారింది , గంగ- మంగ , ఇంటి గౌరవం  వంటి ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన నటులు చంద్రమోహన్ చక్కటి వీడియో సందేశాన్ని పంపించారు. 


శోభన్ బాబు చిత్రాల నుంచి ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి పాటలను  ఆకునూరి శారద తో పాటు చెన్నై కి చెందిన రాము, అమెరికాకు చెందిన సింగెర్స్ విశ్వమోహన్, శ్రీకర్ దర్భ, నాగి, శ్వేతా, లక్ష్మి  అద్భుతంగా పాడి సంగీత నీరాజం అందించారు. ఈ కార్యక్రమాన్ని trinet  live  TV , టీవీ 5 , mana  టీవీ, TV  Asia  ద్వారా ప్రసారమైనది.మాగల్ఫ్ న్యూస్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com