2021: భారతదేశానికి ప్రయాణించే NRIలకు డ్యూటీ ఫ్రీ గైడ్

- January 24, 2021 , by Maagulf
2021: భారతదేశానికి ప్రయాణించే NRIలకు డ్యూటీ ఫ్రీ గైడ్

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయులకు, NRIలకు, ఫారెన్ లో సెటిల్ అయిన భారత సంతతి చెందిన వారికి వెంట తెచ్చుకుంటున్న వస్తువులపై పన్ను మినహాయింపులు ప్రకటించింది ప్రభుత్వం. 2016 నుంచే డ్యూటీ ఫ్రీ సిస్టం అమలులో ఉన్నా..ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ దేశం నుంచి తిరిగి వస్తున్నారు, ఏంత కాలం అక్కడ ఉండి వస్తున్నారు..ఎంత విలువైన లగేజీతో ఇండియా చేరుకుంటున్నారు అనే అంశాల ఆధారంగా పన్ను మినహాయింపు ఆధాపడి ఉంటుంది. వ్యక్తిగత వస్తువులకు సంబంధించి 50 వేల వరకు ఎలాంటి పన్ను ఉండదు( 2016, ఏప్రిల్ నుంచే ఈ నిబంధన అమలులో ఉంది). అయితే..ఏయే వస్తువులు వెంట తెచ్చుకుంటున్నారో ముందుగానే క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చిన్నారులకు సంబంధించి వాడుతున్న వస్తువులపై ఎలాంటి పన్ను విధించరు. అయితే..తమ దగ్గర తక్కువ విలువ వస్తువులు ఉన్నంత మాత్రాన తోటి ప్రయాణికులకు సహాయంగా వారి లగేజీని కలుపుకొని లెక్క చూపిస్తే ఒప్పుకోరు. అందుకే ఎవరి వస్తువుల వివరాలను వారు ముందుగానే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వస్తువులు, అభరణాల ఆధారంగా పన్ను పరిధిలోని రాని వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 

బంగారం, వెండి ఆభరణాలు:

- విదేశాల్లో ఒక సంవత్సరం అంతకుమించి ఉన్న వారు మాత్రమే పన్ను లేకుండా బంగారు, వెండి నగలు తెచ్చుకునేందుకు అర్హులు. అదీ కూడా నిర్ణీత పరిమాణంలో మాత్రమే అనుమతిస్తారు. ఎంతమేర నగలను తమ వెంట తెచ్చుకుంటున్నారో ముందుగానే స్పష్టం చేయాల్సి ఉంటుంది.
- పరుషులైతే 50 వేల విలువ వరకు బంగారు అభరణాలను తమ వెంట ఎలాంటి పన్ను చెల్లించకుండా తీసుకు రావొచ్చు. అదే మహిళలు అయితే లక్ష రూపాయల విలువైన నగల వరకు పరిమితి ఉంటుంది.
- పరిమితికి మించి అభరణాలను వెంట తెచ్చుకుంటే మాత్రం వాటి విలువ ఆధారంగా 10% పన్ను విధిస్తారు.
- ఇక విదేశాల్లో ఆరు నెలలు మాత్రమే ఉండి వచ్చే వారికి మాత్రం తమ వెంట ఎంత విలువైన అభరణాలు తెచ్చుకుంటే వాటి మొత్తం ఆధారంగా 12.5% పన్ను విధిస్తారు. (ఏడాదిలో రెండు సార్లు వచ్చి వెళ్లే వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది)
- బంగారాన్నిబిస్కెట్లు, కాయిన్ల రూపంలో తీసుకొచ్చే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. 

ల్యాప్ టాప్, ఫ్లాట్ ప్యానల్ టీవీలు:

- ప్రయాణికులు తమ వెంట ఒక ల్యాప్ టాప్ (నోట్ బుక్ కంప్యూటర్) వెంట తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తారు. దీనిపై ఎలాంటి పన్ను విధింపు ఉండదు. అయితే..ప్రయాణికుడి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఫ్లాట్ ప్యానల్ (ఎల్సీడీ, ఎల్ఈడీ, ప్లాస్మా) టీవీలపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. వాటి స్క్రీన్ సైజ్ ఆధారంగా(2013లో అమలులో వచ్చిన నిబంధనల మేరకు) కస్టమ్ డ్యూటీ చెల్లించాలి. కస్టమ్స్ పన్ను 35% నుంచి మొదలవుతుంది. అలాగే ఎడ్యూకేషన్ పన్ను మరో 3% అదనంగా చెల్లించాలి.
-టీవీ మోడల్, తయారైన సంవత్సరం, టీవీ కండీషన్ ను బట్టి కస్టమ్స్ అధికారులే దాని విలువను నిర్ధారించి..ఆ విలువలో 35% పన్నుగా విధిస్తారు. 

అల్కహాల్, పొగాకు ఉత్పత్తులు :

- 2 లీటర్ల వరకు వైన్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ ఫ్రీగా తీసుకువెళ్లొచ్చు.
- 100 సిగరేట్లు (లేదా) 25 సిగార్స్(లేదా) 125 గ్రాముల వరకు పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి పన్ను ఉండదు
- పరిమితికి మించి అల్కాహాల్, పొగాకు ఉత్పత్తులతో భారత్ చేరుకుంటే మాత్రం పన్ను తప్పదు. 
   సిగరెట్లు – BCD @100%+ ఎడ్యూకేషన్ సెస్ @ 3%
   విస్కీ – BCD @150% + ACD @ 4%  
   బీర్ – BCD @100% + ఎడ్యూకేషన్ సెస్ @ 3%


విదేశీ నగదు :

- విదేశాల నుంచి భారత్ చేరుకునే వారు తమ వెంట తెచ్చుకునే విదేశీ నగదుపై ఎలాంటి పరిమితులు లేవు. అయితే..5,000 అమెరికా డాలర్లు, ఫారెన్ ఎక్సెంజ్ రూపంలో 10,000లకు మించి విదేశీ నగదు ఉంటే ముందుగానే ఆ విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.
- భారత కరెన్సీని వెంట ఉంటే అనుమతి ఇవ్వరు. అయితే..భారత పౌరులై ఉండి..విదేశీ పర్యటన ముగించుకొని వచ్చే వారు మాత్రం తమ వెంట 25 వేల రూపాయలను ఉంచుకోవచ్చు.

గృహోపకరాణాలు:

-  3 నుంచి 6 నెలల వరకు విదేశాల్లో ఉండి మళ్లీ భారత్ కు నివాసాన్ని మార్చుకునే వారు తమ వెంట రూ.60,000 విలువైన గృహోపకరణాల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
- 6 నెలల నుంచి ఏడాది పాటు విదేశాల్లో ఉండి తిరిగి వెళ్లేవారు వారు రూ.1,00,000 విలువైన గృహోపకరాణాలను పన్ను లేకుండా తీసుకెళ్లవచ్చు.
- ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు విదేశాల్లో ఉండి తిరిగి వెళ్లేవారు రూ.2,00,000 విలువైన గృహోపకరాణాలను పన్ను లేకుండా తీసుకెళ్లవచ్చు.
- రెండేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు విదేశాల్లో ఉండి తిరిగి వెళ్లేవారు రూ.5,00,000 విలువైన గృహోపకరాణాలను పన్ను లేకుండా తీసుకెళ్లవచ్చు.
అయితే...గృహోపకరాణాల జాబితాలోకి కలర్ టీవీలు, హోమ్ థియేటర్ సిస్టం, డిష్ వాషర్, వీడియో కెమెరాలు, 300 లీటర్ల సామర్ధ్యం వరకు ఉనన ఫ్రిడ్జ్ లు అనుమతించరు. వాటికి నిబంధనలకు లోబడి విడిగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com