కొత్త ర్యాపిడ్ పరీక్షలకు అబుధాబి అనుమతి...20 నిమిషాల్లో రిజల్ట్

- January 24, 2021 , by Maagulf
కొత్త ర్యాపిడ్ పరీక్షలకు అబుధాబి అనుమతి...20 నిమిషాల్లో రిజల్ట్

అబుధాబి:కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాల జాప్యం ఆరోగ్య శాఖలోని అత్యవసర విభాగాల్లో చికిత్సకు విఘాతంగా మారుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వైరస్ సోకిందో..లేదో తెల్సుకున్నాకే వైద్య చికిత్సలు అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా అత్యవసరంగా చికిత్స అందించాల్సి వచ్చినప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి. పేషెంట్ల కు కోవిట్ టెస్ట్ నిర్ధారించిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తుండటం అత్యవసర విభాగాల్లోని పేషెంట్లకు అతి పెద్ద సమస్యగా మారింది. అయితే..వీటికి విరుగుడుగా కేవలం 20 నిమిషాల్లోనే కోవిడ్ టెస్ట్ రిజల్ట్ తెలిపే ర్యాపిడ్ టెస్టులకు అబుధాబి ఆమోదం తెలిపింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు, అర్జెంట్ కేర్ సెంటర్లలో ఎంతో దోహదపడున్నాయి. అబుధాబి ఆమోదించిన ర్యాపిడ్ టెస్ట్ విధానాల వివరాలు ఇలా ఉన్నాయి.

యాంటిజెన్ టెస్ట్ : ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకొని వైరస్ ఉందో లేదో కేవలం 20 నిమిషాల్లో నిర్ధారిస్తారు.
ఆర్టీ లాంప్ జనటిక్ టెస్ట్ : ఈ విధానంలోనూ ముక్కు నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. 60 నిమిషాల్లో ఫలితం తేలిపోతుంది.
సలైవ స్పెసిమెన్స్(లాలజల నమూనా విధానం) : ఈ విధానాన్ని చిన్న పిల్లల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లల ముక్కు నుంచి శాంపిల్స్ తీయటం ఇబ్బంది మారినప్పుడు వారి లాలా జలాన్ని సేకరించి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com