దుబాయ్:దీపావళి-2022 కి సిద్ధంకానున్న హిందూ మందిరం...
- January 25, 2021
దుబాయ్: దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబర్‌కు పూర్తవనున్నట్టు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ ఆదివారం వెల్లడించారు. 2022 దీపావళికి దేవాలయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే బేస్మెంట్ పూర్తయినట్టు పేర్కొన్నారు.
ఈ దేవాలయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. బర్ దుబాయ్ లో ఉన్న సింధి గురు దర్బార్ దేవాలయానికి పొడిగింపుగా ప్రస్తుత దేవాలయ నిర్మాణం జరుగుతోంది. దుబాయ్‌లో ఉన్న పురాతన దేవాలయాల్లో సింధి గురు దర్బార్ దేవాలయం ఒకటి. 1950లలో ఈ దేవాలయం ప్రారంభమైంది. కొత్తగా నిర్మించబోయే దేవాలయం అరేబియన్ లుక్‌లో కనిపించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష