కోవిడ్ వ్యాక్సిన్లపై రూమర్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

- January 25, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్లపై రూమర్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా గత వారం రాసిన ఈ లేఖలో విపత్తు నిర్వాహణ చట్టం, భారత శిక్ష్మా స్మృతిలోని చట్టాలను ప్రస్తావిస్తూ.. వ్యాక్సిన్ల విషయంలో రుమార్లను వ్యాప్తి చేస్తున్న వారికి వర్తింప జేయాలని ఆదేశించారు. అదే సమయంలో వాస్తవాలేంటో తెలియజేయాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రుమార్లు చేస్తున్నారని, దీని వల్ల ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 16 నుండి దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన సంగతి విదితమే. భారత్‌ బయోటెక్‌ నేతృత్వంలోని కొవాగ్జిన్‌, ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫోర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ను తొలుత వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు అందిస్తున్నారు. కాగా, ఈ రెండు 110 శాతం సురక్షితమని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిజిజిఐ) విజి సోమని తెలిపారు. కొవిషీల్డ్‌ 70.42 శాతం సురక్షితంగా కాగా, కొవాగ్జిన్‌ సురక్షితంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com