`రాధాకృష్ణ` విడుదల తేదీ ఖరారు
- January 25, 2021
హైదరాబాద్:ప్రముఖ దర్శకుడు `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంతెన నరసింహరాజు (చిలుకూరు) సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి5న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత పుప్పాల సాగరిక కృష్ణకుమార్ మాట్లాడుతూ - ``మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం.ఎం. శ్రీలేఖ గారి సంగీత సారథ్యంలో విడుదలైన అన్ని సాంగ్స్ సూపర్‌హిట్ అయ్యాయి. అలాగే టీజర్‌కి, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మల్ బొమ్మల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మంచి ప్రేమకథా చిత్రమిది. హీరో, హీరోయిన్స్‌గా అనురాగ్, ముస్కాన్ సేథీ చక్కగా నటించారు. అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు చేసిన స్పెషల్ రోల్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. లక్ష్మి పార్వతి గారు ఫస్ట్‌టైమ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతో సహకారం అందించారు. ఫిబ్రవరి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), లక్ష్మీ పార్వతి, అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, ఎడిటింగ్: డి. వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, కో- ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, సమర్పణ: మంతెన నరసింహరాజు (చిలుకూరు), నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు