హోం క్వారంటైన్ ఉల్లంఘన ఏడుగురి అరెస్ట్

హోం క్వారంటైన్ ఉల్లంఘన ఏడుగురి అరెస్ట్

దోహా:హోం క్వారంటైన్ ఉల్లంఘన నేపథ్యంలో ఏడుగుర్ని అరెస్ట్ చేస్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టకుని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, నిబంధనల మేరకు హోం క్వారంటైన్‌లో వుండడం వంటివి వీటిల్లో ముఖ్యమైనవి. కాగా, జాక్ కమాల్ దునిబి, సలెమ్ అలి అల్ అలావి, జబీర్ వాలికత్ పుతియా మిఖాయిల్, సల్మాన్ మొహ్మద్ ఇబ్రహీం అహ్మద్ ఇబ్రహీం, తామెర్ సలాహెల్దిన్ అవాద్ అబ్దల్ అజీజ్, సబీల్ జాదా, నహ్యాన్ ఖాలిద్ నహ్యాన్ అల్ మురైజిక్ అల్ మర్రి తదితరుల్ని హోం క్వారంటైన్ ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచించిన నిబంధనల్ని పాటించాల్సిందిగా సంబంధిత అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Back to Top