ఫ్రాడ్ కేసులో పది మంది ఆసియా జాతీయుల అరెస్ట్

ఫ్రాడ్ కేసులో పది మంది ఆసియా జాతీయుల అరెస్ట్

మనామా:డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఫ్రాడ్ కేసుల్లో 10 మంది ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. బాధితుల వివరాల్ని సేకరించి, వారి బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుని బహ్రెయిన్ వెలుపలకు మళ్ళించినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. సమాచారం అందుకోగానే, విచారణ చేపట్టడం జరిగిందనీ, ఈ క్రమంలోనే  నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇతరులకు బ్యాంకు వివరాలు అందించేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, అపరిచితులకు ఎలాంటి వివరాలూ చెప్పకూడదని అథారిటీస్ వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. హాట్ లైన్ నెంబర్ 992కి ఫోన్ చేయడం ద్వరా ఈ తరహా మోసాలపై సమాచారం అందించాలని అథారిటీస్ విజ్నప్తి చేస్తున్నాయి.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top