నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభం
- January 28, 2021
హైదరాబాద్:నవీన్ చంద్ర హీరోగా మంచి ఆదరణ పొందారు. టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రస్తుతం సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తన తాజా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభ వేడుకలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు మూవీ స్క్రిప్ట్‌ను అందచేశారు. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవీన్ స్టోరీ లైన్ వినగానే నాకు చాలా నచ్చి వెంటనే సినిమా ఓకే చెప్పేశానని అన్నారు. ‘‘అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో మధుబాలగారి వంటి వారితో నటించడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంద’ని నవీన్ అన్నారు. ఈ సినిమాను గొప్ప థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







