అడవి శేష్ 'మేజర్' విడుదల తేదీ ఖరారు
- January 29, 2021
హైదరాబాద్:తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో అడవి శేష్ కూడా ఒకడనడంలో సందేహం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వం వహిస్తుండగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో కథానాయిక. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి. కాగా.. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష