ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...
- January 29, 2021
ఢిల్లీ:ఢిల్లీలో జనవరి 26 వ తేదీన జరిగిన ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రస్తుతం సైనిక పహారాలో ఉన్నది. ఒకవైపు ఘర్షణలకు కారణమైన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక, ఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతులు సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికులు కొందరు రైతులు వేసుకున్న గుడారాలను పీకేశారు. గుడారాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో రైతులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత టియర్ గ్యాస్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







