ఢిల్లీ ఇజ్రాయల్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు
- January 29, 2021
ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైదు కార్ల అద్దాలు మాత్రం బాంబు పేలుడు ధాటికి డ్యామేజీ అయ్యాయని తెలిపారు.
బాంబు పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు. అబ్దుల్ కలామ్ రోడ్డుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వాటిని తనిఖీలు చేస్తున్నారు. అయితే, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ప్రధాని మోడీ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఇతర ప్రభుత్వ అధికారులు,నాయకులు హాజరైన విజయ్ చౌక్ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించిడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







