కేజీఎఫ్ 2 విడుదల తేదీ ఖరారు..!!
- January 29, 2021కేజీఎఫ్ సినిమాతో యశ్ ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమా సౌత్ కంటే నార్త్ లో భారీ హిట్ ను అందుకుంది. కేజీఎఫ్ సినిమా సమయంలోనే సెకండ్ చాఫ్టర్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా, ఇప్పుడు సినిమాకు రిలీజ్ డేట్ ను యూనిట్ అనౌన్స్ చేసింది. జులై 16 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా యూనిట్ తెలియజేసింది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో కేజీఎఫ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీలో యశ్ తో పాటుగా బాలీవుట్ తారాగణం కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. రిలీజ్ తరువాత కేజీఎఫ్ 2 ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!