దుబాయ్: 11 నెలల తర్వాత తెరుచుకోనున్న చర్చి తలుపులు..ఫిబ్రవరి నుంచి ప్రార్ధనలు

- January 29, 2021 , by Maagulf
దుబాయ్: 11 నెలల తర్వాత తెరుచుకోనున్న చర్చి తలుపులు..ఫిబ్రవరి నుంచి ప్రార్ధనలు

కోవిడ్ కారణంగా దుబాయ్ లో మూతపడిన చర్చి తలుపులు ఎట్టకేలకు 11 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి దుబాయ్ లోని క్యాథలిక్ చర్చిలో ప్రార్ధనలకు ఎమిరాతి పాలన యంత్రాంగం అనుమతించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి రోజు రెండు సార్లు పార్ధనలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.00 గంటలకు 30 నిమిషాల పాటు మాస్ ఉంటుందని సెయింట్ మేరీస్ క్యాథలిక్ చర్చి నిర్వాహకులు తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించారు. మిగతా సమయాల్లో చర్చిని మూసివేస్తారు. అయితే..భౌతిక దూరం నిబంధనను పాటించేందుకు వీలుగా చర్చి సామర్ధ్యంలో 30 శాతం అంటే 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రార్ధనల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా చర్చి అధికారిక వెబ్ సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొవాలి. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అరగంట ముందే చర్చి ప్రాంగణానికి చేరుకోవాలి. ఫేస్ మాస్క్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రార్ధన సమయంలో నిర్దేశించిన ప్రదేశానికి మాత్రమే భక్తులు పరిమితం కావాలి, గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించి..1,3 గేట్ల ద్వారా బయటికి వెళ్లాలి. 60 ఏళ్లకుపైబడిన వారు, 12 ఏళ్లలోపు ఉన్నవారు ప్రార్ధనలకు రావొద్దని కూడా చర్చి వర్గాలు స్పష్టం చేశాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com