ప్రసూతి సెలవులను 70 రోజులకు పెంచిన బహ్రెయిన్
- January 29, 2021
బహ్రెయిన్ : ఇప్పటి వరకు ఉన్న ప్రసూతి సెలవులను మరో పది రోజులు పెంచింది బహ్రెయిన్. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. ప్రసవం తర్వాత తన బిడ్డ ఆలనపాలన చూసుకునేందుకు తల్లికి రెండు నెలల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..ప్రసూతి సెలవుల పెంపు తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం తెలుపటంతో ఇక నుంచి ప్రసూతి సెలవులు 70 రోజులకు పెరగనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అంతేకాదు..తండ్రులకు కూడా సెలవుల సంఖ్యను పెంచారు. ప్రసూతి సమయంలో భార్య, బిడ్డలకు తోడుగా ఉండేందుకు గతంలో ఒక రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారు. కొత్త రూల్ ప్రకారం ఇక నుంచి మూడు రోజులు సెలవులు తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







