అమెరికాలో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
- January 30, 2021
అమెరికా:జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి రోజున మహాత్ముడికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దావిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న 6 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు. అయితే ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలిగించి... దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. కాగా దీనిపై భారత అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







