ఆసుపత్రి నుండి శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే..
- January 31, 2021
బెంగుళూరు: ఎఐడీఎంకె మాజీ నేత శశికళ బెంగుళూరులోని ఆసుపత్రి నుండి ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో జైలు నుండి ఆసుపత్రిలో చేరిన శశికళ ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
బెంగుళూరు నుండి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలోనే ఆమె జైలు నుండి విడుదలయ్యారు. ఆసుపత్రిలోనే ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేశారు.
ఆమె ఆరోగ్యంగా ఉన్నందున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు శనివారం నాడు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అక్రమాస్తుల కేసులో శశికళను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 1600 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. మరో పది రోజుల పాటు బెంగుళూరులోనే శశికళ ఉండే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







