కోవిడ్ ఎఫెక్ట్:ఆఫర్లు,డిస్కౌంట్ల వినతులను రద్దు చేసిన ఒమన్
- January 31, 2021
మస్కట్:కోవిడ్ ఎఫెక్ట్ షాపింగ్ మాల్స్, ఇతర షోరూంలు ప్రకటించే డిస్కౌంట్లు, ఆఫర్లపై కూడా ప్రభావం చూపుతోంది. ఇక నుంచి ఎవరూ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించే అనుమతుల కోసం తమకు వినతులు పంపించొద్దంటూ ఒమన్ నిర్ణయించింది. ఈ మేరకు వినతుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య, పెట్టుబడి ప్రొత్సహాకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయం మేరకే వినతుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే లక్ష్యంగా ఇప్పటికే ఈవెంట్లు, ఎగ్జిబిషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే షాపింగ్ మాల్స్, షోరూంలలో వినియోగదారుల సంఖ్యను కుదించాలన్న ఉద్దేశంతో డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించేందుకు సుప్రీం కమిటీ నిర్ణయించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







