అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే వారికి కొత్త రూల్స్...

- January 31, 2021 , by Maagulf
అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే వారికి కొత్త రూల్స్...

అబుధాబి:యూఏఈ రాజధాని అబుధాబిలోకి రోడ్డు మార్గంలో ప్రవేశించే వారికి మార్గనిర్దేశకాలను సవరించారు. యూఏఈలోని ఏ ప్రాంతం నుంచైనా రాజధాని వైపుగా వచ్చే వారు కోవిడ్ సోకలేదని ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అబుధాబికి దారితీసే అన్ని మార్గాల్లో క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. తనిఖీ సమయంలో ప్రయాణికులు పీసీఆర్ టెస్ట్, డీపీఐ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ ను చూపించాలి. అల్ హోస్న్ యాప్ ఉంటే ఇంకా బెటర్. యాప్ తప్పనిసరి కాదంటూ గతంలోనే ప్రకటించిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యాప్ లోని అప్ డేట్స్ కు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అల్ హోస్న్ యాప్ ద్వారా టెస్ట్ రిజల్ట్ తో పాటు అబుధాబికి వచ్చే వ్యక్తి ఎన్ని రోజుల క్రితం యూఏఈలోకి వచ్చాడు. అతని క్వారంటైన్ గడువు ముగిసిందా లేదా అనేది నిర్ధారించుకుంటున్నారు. ఇక పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న వారు ఒకవేళ అబుధాబిలోనే ఉంటే నాలుగో రోజున తొలిసారి, ఎనిమిదో రోజున రెండోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబి చేరుకునే సమయానికి 48 గంటల్లోపు ఉన్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ నే పరిగణలోకి తీసుకుంటారు. అదే డీపీఐ టెస్ట్ విషయానికి వస్తే రిపోర్ట్ వచ్చిన 24 గంటల్లో అబుధాబి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ సదరు వ్యక్తి రెండ్రోజులకు మించి అబుధాబిలో ఉండాల్సి వస్తే నగరంలోకి ఎంటరైన 48 గంటల తర్వాత మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే...వ్యాక్సిన్ రెండో డోసులు వేసుకున్న వారు, అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్ లేదా 'E' ఐ కాన్ ఉన్నవారికి ఈ నిబంధనలేవి వర్తించవు. అలాగే వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లుగా పాల్గొన్నవారికి కూడా తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com