విదేశాల్లో ప్రవాసీయుల రీ ఎంట్రీ వీసా జారీపై క్లారిటీ ఇచ్చిన జవాజాత్

- February 02, 2021 , by Maagulf
విదేశాల్లో ప్రవాసీయుల రీ ఎంట్రీ వీసా జారీపై క్లారిటీ ఇచ్చిన జవాజాత్

రియాద్:అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుండటంతో విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులకు వీసాల రెన్యూవల్ పై పాస్ పోర్ట్స్ డైరెక్టరేట్-జవాజాత్ క్లారిటీ ఇచ్చింది. ఎగ్జిట్, రీ ఎంట్రీ వీసాలను ఆన్ లైన్లోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే..అంతకుముందు సదాద్ లో నిర్దేశించిన రుసుము చెల్లించి ఆ తర్వాత తమ యజమానికి చెందిన అబ్షర్ లేదా ముకీమ్ ఫ్లాట్ ఫాం ద్వారా వీసా గడువును పొడిగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు కారణంగా విదేశాల్లోనే చిక్కుకుపోయిన వలస కార్మికులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లోని ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు ఇతర వృత్తి నిపుణులు అందరికీ వర్తిస్తుందని కూడా వివరించింది.పది నెలలుగా విదేశాల్లో ఉండిపోయిన వారికి వీసా రెన్యూవల్ అవకాశం ఉంటుందా? అంటూ తమ దృష్టికి వచ్చిన సందేహానికి సమాధానంగా జవాజాత్ వీసా రెన్యూవల్ అవకాశాలను వివరించింది.అయితే..వీసా గడువు ముగిసి 180 రోజులు దాటిన వారి విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించాల్సి ఉందని తెలిపింది. ఇదిలాఉంటే గతేడాది ఫ్రిబ్రవరి 25 నుంచి మే 24 మధ్య గడువు ముగిసిన వీసాలను ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఆటోమెటిగ్గా 3 రెన్యూవల్ చేసిన విషయం తెలిసిందే. కింగ్డమ్ పారిశ్రామిక రంగానికి అవసరమైన కార్మికుల కొరత లేకుండా వీసాల గడువు పెంచుతూ వలస కార్మికులకు వసులుబాటు కల్పిస్తూ వచ్చింది.విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వచ్చేలా వారి వీసాల గడువు విషయంలో సడలింపులు ప్రకటిస్తూ వచ్చింది. అయితే..ఇప్పటికీ రీ ఎంట్రీ వీసాల విషయంలో పొడిగింపు ధోరణిలోనే ఉన్నా...ఆటోమెటిగ్గా రెన్యూవల్ విధానంలో సవరణలు చేస్తోంది.యజమాని ఆమోదంతో ఎలక్ట్రానిక్ విధానంలో సదరు వీసాదారుడు రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com