ఏరో ఇండియా 2021ను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

- February 03, 2021 , by Maagulf
ఏరో ఇండియా 2021ను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

బెంగళూరు:రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కర్ణాటక యలహంకలో ఏరో ఇండియా 2021 ప్రదర్శన కేంద్ర రక్షణశాఖ ప్రారంభించారు.బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శన కొనసాగనుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు రక్షణ శాఖ,హెచ్‌ఏఎల్‌ ప్రతినిధులు దస్త్రాలను మార్చుకున్నారు.అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాబోయే ఏడేనిమిదేళ్లలో మిలటరీ ఆధునీకరణకు 130 డాలర్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.మహమ్మారితో అవరోధాలు ఏర్పడినప్పటికీ..ఈ ఏడాది ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏరో ఇండియా21 భారతదేశం విస్తారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని, రక్షణ.. ఏరోస్పేస్ రంగంలో దేశం అందించే బహుళ అవకాశాలను ప్రదర్శిస్తుందన్నారు.ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఏరో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ నిలుస్తుందన్నారు.

కార్యక్రమంలో 80 విదేశీ కంపెనీలు, డిఫెన్స్ మంత్రులు, డెలిగేట్స్, సర్వీస్ చీఫ్‌లు సహా 540 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని సమాచారం ఉందని, ఇది ప్రపంచ సమాజంలో పెరుగుతున్న ఆశావాదాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రదర్శనలో వ్యక్తిగతంగా చేరిన మాల్దీవులు, ఉక్రెయిన్, ఈక్వెటోరియల్ గినియా, ఇరాన్, కొమోరోస్, మడగాస్కర్ దేశాల రక్షణ మంత్రులతో పాటు ఇతర సంస్థలకు ఏరో ఇండియాలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com