'రీవైండ్' టీజర్ రిలీజ్ చేసిన హీరో రవితేజ
- February 03, 2021
హైదరాబాద్:తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్- తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" తెలుగు టైటిల్ '"రీవైండ్" మరియు టీజర్... ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు.
చిత్ర కథానాయకుడు శింబు పుట్టినరోజు సందర్భంగా.. తను నటిస్తున్న ముల్టీ లింగ్యుల్ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని రవితేజ అన్నారు. హీరో శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.
సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం ఈ చిత్ర ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. తమ చిత్రం "రివైండ్" టీజర్... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రం హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం!!
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు