‘బంగార్రాజు’ షూటింగ్ మొదలు పెట్టనున్న నాగార్జున
- February 03, 2021
హైదరాబాద్:నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు. ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో మొదలవుతుంది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత నాగచైతన్య తో ‘రారండోయ్ వేడుక చూదాం’ రవితేజతో ‘నెల టికెట్’ సినిమా చేసాడు కళ్యాణ్. ఇప్పుడు నాగార్జున ‘బంగార్రాజు’ను ఎలాగైన పూర్తి చేయాలని చూస్తున్నాడు.
తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. బంగార్రాజు మూవీ గతేడాది ఉగాదికే ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసాడట దర్శకుడు కళ్యాణ్. ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణలతో పాటు నాగచైతన్య మరో పాత్రలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







