దుబాయ్ కి ఇండియన్ కోవిడ్ వ్యాక్సిన్..వ్యాక్సినేషన్ విధివిధానాలపై క్లారిటీ
- February 03, 2021
దుబాయ్:ఇప్పటికే రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూఏఈలో లేటెస్ట్ వాటికి మరో వ్యాక్సిన్ యాడ్ అయ్యింది.భారత ఉత్పాదక కోవిడ్ వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాకు దేశంలో అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఫైజర్-బయోన్టెక్, సినోఫార్మ్ తో పాటు అస్ట్రాజెనెకాను కూడా వ్యాక్సినేషన్ ప్రొగ్సాంలో ఇంప్లీడ్ చేసింది యూఏఈ. అయితే..దుబాయ్ లో అస్ట్రాజెనెకా పంపిణీ విధివిధానాలపై దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రజలకు స్పష్టత ఇచ్చింది.ఎమిరేట్స్ పరిధిలోని వన్ సెంట్రల్ వ్యాక్సినేషన్ సెంటర్ లో అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నవారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది.ఫ్ట్రంట్ లైన్ వర్కర్లు, కీలక రంగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ఏ వెల్లడించింది. వ్యాక్సిన్ కోసం ముందుగా అపాంట్మెంట్ తీసుకోవాలని..ఫ్రంట్ లైన్ వర్కర్లు, కీలక రంగాల్లోని ఉద్యోగుల విషయంలో ఆయా ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల యాజమాన్యలతో సమన్వయం చేసుకొని అపాంట్మెంట్ ఖరారు చేయనున్నారు.ఇక సాధారణ ప్రజలు అపాయింట్మెంట్ కోసం 800342 కాల్ చేయాలని డీహెచ్ఏ సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష